అమ్మ తన అలవాటుని మానేద్దామనుకుంది.. కానీ అంతలోనే తన 19 నెలల చిన్నారి..

అమ్మ తన అలవాటుని మానేద్దామనుకుంది.. కానీ అంతలోనే తన 19 నెలల చిన్నారి..

పెళ్లికి ముందు అలవాటు. పెళ్లయిన తరువాత మానేయాలనుకుంది. అంతలోనే ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఈసారి ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఎలా అయినా తన స్మోకింగ్ అలవాటుని తగ్గించుకోవాలని. అందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అంతలోనే తన 19 నెలల చిన్నారిని పోగొట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ మహిళకు విపరీతంగా సిగరెట్స్ తాగే అలవాటు ఉంది. అది తన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని గ్రహించి బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా సిగరెట్లు మానేద్దామని అనుకుంది. అందుకే ఆమె లిక్విడ్ నికోటిన్‌ను అమెరికా నుంచి తెప్పించుకుంది. అప్పటి నుంచి దాన్ని ఇ- సిగరెట్‌లో పొగ కోసం వేసుకునే వేప్ జ్యూస్‌లో కలుపుకుని స్మోక్ చేయడం అలవాటు చేసుకుంది. ఓ రోజు లిక్విడ్ నికోటిన్ కలిపిన జ్యూస్ బాటిల్‌ని బయట పెట్టి ఇంట్లోకి వెళ్లింది.

ఇంతలో బయట ఆడుకుంటున్న చిన్నారి వచ్చి బాటిల్‌లోని జ్యూస్‌ని తాగేశాడు. బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వాడు నికోటిన్ జ్యూస్ తాగేశాడని తెలుసుకుంది. వెంననే ఆసుపత్రికి వెళితే వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయినా చిన్నారి ప్రాణాలు కాపడలేకపోయారు. 11 రోజులు మృత్యువుతో పోరాడి చిన్నారి తనువు చాలించాడు. తన అలవాటు తన బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైందని తల్లి కన్నీరు మున్నీరవుతోంది. హానికారక వస్తువులను చిన్నారులు ఉన్న ఇళ్లలో వారికి అందేలా ఉంచొద్దని ఈ సందర్భంగా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story