ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మత ప్రచారం

ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మత ప్రచారం

గుళ్లు, ఆస్పత్రులే కాదు..చివరికి ప్రభుత్వ పాఠాశాలలను కూడా వదలడం లేదు!. తమ మత ప్రచారాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు క్రైస్తవప్రచారకులు. ఖమ్మంలోని శాంతినగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో క్లాసుల వారిగా బైబిళ్లను పంచి పెట్టారు. విషయం తెల్సుకున్న ఏబీవీపీ కార్యకర్తలు.... అక్కడికి వెళ్లే సరికి పరారయ్యారు క్రిస్టియన్ మత ప్రచారకులు.

తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా క్రైస్తవ మత ప్రచారం జోరుగా సాగుతోంది. గుళ్లు, ఆస్పత్రులే కాదు..చివరికి ప్రభుత్వ పాఠాశాలల్లో కూడా మత ప్రచారానికి అడ్డాలుగా మార్చుకుంటున్నారు క్రైస్తవ ప్రచారకులు. ఇటీవల కాలంలో ఈ జాడ్యం మరీ ఎక్కువైంది. ఏ వీధిలో చూసినా, ఏ గ్రామంలో చూసినా.... తమ మతాన్ని ప్రచారం చేస్తున్నారు క్రైస్తవ ప్రచారకులు.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ స్కూళ్లను టార్గెట్‌ చేశారు. ఖమ్మం శాంతినగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో బైబిల్ ను పంచి పెట్టారు. క్లాసుల వారీగా తిరిగి ప్రతీ విద్యార్ధికి ఒక్కో బైబిల్ చొప్పున ఇచ్చారు.. ప్రభుత్వ పాఠశాలలోకి మతప్రచారం విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు అక్కడి వచ్చారు. అయితే... ఏబీవీపీ నేతలు.. వచ్చే సరికి క్రిస్టియన్‌ మత ప్రచారకులు అక్కడనుంచి పరారైపోయారు..మత ప్రచారాకులను ఎలా అనుమతి ఇచ్చారనేది వివాదాస్పదంగా మారింది. మత ప్రచారకులను స్కూలులోకి అనుమతించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏబీవీపీ కార్యకర్తలు . స్కూల్ సిబ్బందిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.....

Tags

Read MoreRead Less
Next Story