బంగార్రాజు.. బూట్లు, బెల్టు కూడా బంగారమే మరి..

అమ్మాయిలకి బంగారం పిచ్చి వుందంటే అర్థం వుంది. కానీ ఇక్కడ అబ్బాయికి కూడా బంగారం అంటే తగని మోజు. పెద్దయ్యాక పేద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఒంటినిండా బంగారం ధరించాలని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాడట. అందుకోసం పగలు రాత్రి కష్టపడి మొత్తానికి వ్యాపార సూత్రాలు వంట బట్టించుకున్నాడు. బిజినెస్‌లో లాభాలు గడించాడు. తన కోరిక కలగా మిగిలిపోకూడదని జస్ట్ రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టి 5 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేయించుకున్నాడు.

మెడలో మెలికలు తిరిగిన ఓ పెద్ద గొలుసు, చేతికి వెడల్పాటి బ్రేస్‌లెట్, బొటన వేలిని మాత్రం విడిచి పెట్టి చేతికి ఉన్న మిగతా ఎనిమిది వేళ్లకి బరువైన ఉంగరాలు, కాళ్లని మాత్రం ఎందుకు వదలాలని వాటికీ బంగారు బూట్లు తొడిగాడు ఈ బంగార్రాజు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం బెల్టు కూడా బంగారంతోనే చేయించుకున్నాడట. ఇక తను వాడే ఫోన్ కవర్ కూడా బంగారంతోనే చేయించుకున్నాడు ఈ బంగారు కొండ. రోజూ ఈ ఆభరణాలను ధరించి అద్ధంలో చూసుకుని మురిసి పోతుంటాడట పూణేకు చెందిన ప్రశాంత్ సప్కల్. మ్యూజిక్ డైరక్టర్ బప్పీ లహరి అంటే బోలెడంత పిచ్చి.. ఇంతకీ పిచ్చి.. ఆయన సంగీతం అంటే అనుకునేరు.. ఆయన ఆహార్యం అంటే ప్రశాంత్‌కి చాలా ఇష్టమట. చిన్నప్పటి నుంచే ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని పెద్దయ్యాక.. ఇదిగో ఇప్పుడిలా ఒళ్లంతా బంగారంతో నింపేసి బంగార్రాజైపోయాడు. ప్రస్తుతం ప్రశాంతం ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.