టీవీ5 కథనాలపై స్పందించిన TSMIDC ఎండీ చంద్రశేఖరరెడ్డి

లంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందంటూ టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించారు అధికారులు. వైద్య పరికరాలు నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఫెడర్‌ సింధూరి సంస్థను టెర్మినేట్‌ చేశారు. మిగిలిన సంస్థలపైనా చర్యలకు రెడీ అవుతున్నారు అధికారులు

తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, పేట్లబురుజు, సుల్తాన్‌ బజార్, ఫీవర్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. ఇలా ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా అక్కడ నిర్వహణ అస్తవ్యస్తం. రోగుల్ని పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఇక… ఈ ఆసుపత్రులకు ఇచ్చే మందుల విషయంలోనూ గోల్‌ మాల్‌ జరుగుతోంది. ప్రభుత్వం ఒక్కో ఆస్పత్రికి మందుల కోసం ప్రతి 3 నెలలకోసారి మూడున్నర లక్షలు మంజూరు చేస్తోంది ప్రభుత్వం. మొత్తం 145 రకాల మందులు సరఫరా చేయాలి. కానీ కేవలం 30నుంచి 40 రకాలకు మించి దొరకడం లేదు. సాధారణ మందులతో పాటు అత్యవసరం సమయాల్లో వాడాల్సిన మందులు కూడా లేవు. పైగా వీటి భారం కూడా రోగులే మీద పడుతోంది. అంతేకాదు…
వైద్య పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…ప్రభుత్వాసుపత్రుల అస్తవ్యస్త నిర్వహణ, మందుల కొరతపై టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించింది ప్రభుత్వం. ముందుగా వైద్య పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఫెడర్ సింధూరి సంస్థను టెర్మినేట్ చేసింది. ఈ సంస్థకు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడం లేదన్నారు TSMIDC ఎండీ చంద్రశేఖరరెడ్డి.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 35వేల పరికరాలున్నాయి. 25 నుంచి 30 కంపెనీలు ఈ పరికరాలు సరఫరా చేయడంతో పాటు.. నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని సంస్థలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు చంద్రశేఖర్‌రెడ్డి. భవిష్యత్తులోనూ వీటిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. మందుల సరఫరాలో కంపెనీలకు గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేశారు. డేట్ అయిపోతున్న మందులను 90 రోజలు ముందే తీసుకుని కొత్త స్టాకు ఇవ్వాలి. అలా చేయని పక్షంలో మందుల కంపెనీలపై యాక్షన్ తీసుకుంటామంటూ హెచ్చరించింది ప్రభుత్వం. .

Recommended For You

Leave a Reply

Your email address will not be published.