భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక మృతి చెందిన భర్త

భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక మృతి చెందిన భర్త
X

దంపతుల మధ్య మాటామాటా పెరిగింది. చివరికి ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. పట్టరాని కోపం ఊగిపోయిన భార్య కర్రతో భర్త తలపై విపరీతంగా కొట్టింది. ఈ దాడిలో భర్తకు తీవ్ర రక్తస్రావమైంది. భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక భర్త స్పాట్‌లోనే కన్నుమూశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో జరిగింది.

కట్టుకున్న భార్యే భర్తను చంపడం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే భార్యకు మతిస్థిమితం లేదని బంధువులు, స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Next Story