విద్యార్థులకు ‘మహీంద్రా’ స్కాలర్‌షిప్స్.. దరఖాస్తుకు ఆఖరు తేదీ..

ప్రతిభ ఉండి డబ్బు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్‌ను 1995లో ప్రారంభించింది కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఆర్థికంగా వెనుకబడ్డ పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రతిఏటా స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఇప్పటివరకు 9640 మంది విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించింది. డిప్లొమా చదువుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 550 మంది విద్యార్థులకు ఏటా రూ.10,000 చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తుంది మహీంద్రా ట్రస్ట్. స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు దేశంలోని 12 కేంద్రాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా స్కాలర్ షిప్ పొందే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లో డిప్లొమా కోర్సులో అడ్మిషన్ పొందినవారు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డ్ ఎగ్జామ్‌లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. విద్యార్థినులు, పేద విద్యార్థులు, దివ్యాంగులు, సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్ తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: జులై 2019
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్ట్ 22, 2019
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.kcmet.org

Recommended For You

Leave a Reply

Your email address will not be published.