నీలి నీడ కమ్మేస్తోంది.. పడుకునే ముందు 87 శాతం మంది..

స్మార్ట్‌ఫోన్ కల్చర్ యువత భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముతోంది. మంచి కోసం వాడాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన యువతరం చెడు వైపు మళ్ళిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లోని నీలికాంతులు కుర్రాళ్ల జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. పలు సైట్లలోని నీలి చిత్రాలు వీక్షణం వారి భవిష్యత్‌ను అంధకారంలో పడేస్తోంది. యువతి,యువకుల మధ్య ఆకర్షణ కలగడానికి ఇవే కారణమని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. క్షణం తీరిక లేకుండా చాలా మంది యువతి ఫోన్‌లోనే గడిపేస్తున్నారు. క్షణకాలం ఫోన్లు ఆగినా గందరగోళానికి గురవుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లు యువతను కాటేస్తున్నాయి. మత్తు ఎక్కిస్తున్నాయి, బానిసలుగా మారుస్తున్నాయి. తాజాగా ఓ అధ్యయన సంస్థ యువత స్మార్ట్ ఫోన్ వినియోగంపై చేసిన సర్వేలో విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చాయి.యువత రోజులో కనీసం 3- 7 గంటలు సామాజిక మాధ్యమాల కోసం వెచ్చిస్తున్నట్లు తేలింది. పోర్న్‌సైట్ల్‌కు బానిసలైన రాష్ట్రాల్లో తెలంగాణ 30వ స్థానంలో ఉంది. నగరాలలో హైదరాబాద్‌ రెండోస్థానంలో ఉండటం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతుంది. ఇంటర్‌నెట్ విహారంలో 10 లక్షలకు పైగా పోర్న్‌సైట్లు ఉంటాయనేది నిపుణుల అంచనా, పోర్న్‌సైట్లు వల్ల యువతలో లైంగిక వాంఛ పెరిగిపోయి చిన్నారులపై లైంగిక దాడులకు కారణమవుతుంది అని మానసిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఒంటరితనం, జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనవడానికి కారణం ఎక్కువగా ఫోన్ వాడటమే అని నిర్ధారించారు. ఈ అలవాటు కనుక మారకపోతే సామాజిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్ అనుకున్నంత స్మార్ట్‌గా ఉండదనే విషయం వారికి అర్ధం అయ్యేలా వివరించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వాటిని ఉపయోగించే తీరును యువత మార్చుకోవాల్సిందే లేదంటే జీవితం అంధకారమే.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.