కత్తి పట్టుకున్న యువకుడి ఫోటో.. విజయవాడలో కలకలం

ఓ యువకుడు కత్తిని షర్టులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్న ఫోటో విజయవాడలో సంచలనంగా మారింది. కానూరు ప్రాంతంలో కెమెరాకు చిక్కిన ఈ ఫోటో నగర వాసుల్లో భయాందోళనలు రేపింది. మళ్లీ నగరంలో రౌడీయిజం మొదలైందా అన్న అనుమానాలు రేకెత్తించింది. అయితే ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు.. బైక్‌ నెంబర్‌ ఆధారంగా ఆ యువకుడు షేక్‌ ఫయాజ్‌గా గుర్తించారు. అతనితో పాటు అతని స్నేహితుణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మేకలకు గడ్డి కోయడానికే కత్తిని పట్టుకెళ్లినట్లు ఫయాజ్‌ చెప్పగా.. పోలీసులు పూర్తి విచారణ జరిపి.. యువకుడు చెప్పింది నిజమేనని గుర్తించారు. అయితే బహిరంగంగా ఇలా ప్రవర్తించడం తప్పని.. మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటూ యువకులకు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చి పంపించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.