తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు!

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సిద్ధమవుతోంది మోడీ సర్కారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వస్థీకరణపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా అంతర్గత సమావేశం నిర్వహించింది. ప్రధాన అధికారి సునీల్‌ అరోరా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌తోపాటు ఏపీ, తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చించారు. ఈ సమావేశానికి… ఇద్దరు ఎన్నికల అధికారులు అశోక్‌ లావస, సుశీల్‌ చంద్రతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్నతాధికారులు ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలుస్తోంది. అటు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం… సిక్కింలోనూ అసెంబ్లీ సీట్ల కూడా పెంచాలి. దీంతో జమ్మూకశ్మరీతో పాటు మిగిలిన మూడురాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ సీట్లను పెంచాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం ప్రకారం…జమ్ముకశ్మీర్‌లో ఏడు సీట్లను పెంచాలి. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 107 అసెంబ్లీ సీట్ల సంఖ్య… 114కు పెరగనుంది. అటు ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీలో 50 సీట్లను పెరగాలి. దీంతో ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 225కి పెరగనుంది. అటు తెలంగాణలోనూ ప్రస్తుతం ఉన్న119 అసెంబ్లీ స్థానాలు.. 153కు పెరగనున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వస్థీకరణకు సంబంధించిన ఫైల్‌… హోం మంత్రిత్వశాఖ నుంచి ఎన్నికల సంఘానికి చేరింది. అయితే…హోమంత్రిత్వ శాఖ నుంచి వచ్చే విజ్ఞప్తి కోసం ఎన్నికల సంఘం ఎదురుచుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

అటు బీజేపీ అగ్రనేతలు కూడా తెలుగురాష్ట్రాల్లో సీట్ల పెంపుపై ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా….. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలతో సమావేశమై దీనిపై చర్చిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌ విషయానికకొస్తే… హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలోనే అసెంబ్లీ సీట్లు పెంచితే బీజేపి లాభాపడుతుందని భావిస్తోంది కేంద్రం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.