మహానటి.. ఉత్తమనటి.. ‘సావిత్రి’కి దక్కిన సైమా

ప్రతిభకు పురస్కారం లభించింది.. నటనకు అవార్డు వరించింది. దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగస్టు 15 నుంచి ఖతార్‌లోని దోహాలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాధిక, త్రిష, నిధి అగర్వాల్, అనసూయ, పాయల్ రాజ్‌పుత్ అందరూ వేడుకల్లో మెరిశారు. ఈ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి ఎంపిక కాగా, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కీర్తి శిఖరాలను అధిరోహించింది. ఇటీవలే జాతీయ అవార్డు తీసుకున్న కీర్తికి, తాజాగా సైమా అవార్డు పొందడం పట్ల కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఉత్తమ నటుడిగా రంగస్థలం సినిమాకు గాను రామ్‌చరణ్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఆయన తరపున చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. ఇక కన్నడలో ఉత్తమ నటుడిగా యష్ కేజీఎఫ్‌లోని తన నటనకు గాను సైమా అవార్డుని గెలుచుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ.. గత ఏడాది విడుదలైన గీత గోవిందం సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాలోని అతని నటనకు గాను క్రిటిక్స్ బెస్ట్ అవార్డును విజయ్ సొంతం
చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా కూడా మరో అవార్డు విజయ్‌ని వరించింది.
సైమా 2019 విజేతలు (తెలుగు)
ఉత్తమ నటుడు – రామ్ చరణ్ (రంగస్థలం)..  ఉత్తమ నటి – కీర్తి సురేష్ (మహానటి).. ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- విజయ్ దేవరకొండ (గీత గోవిందం)
సోషల్ మీడియా సూపర్ స్టార్ – విజయ్ దేవరకొండ.. ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)

Recommended For You

Leave a Reply

Your email address will not be published.