భారత్, పాక్ మధ్య నడిచే థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు చక్కపడుతున్నారు. ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించారు. ప్రధాన నగరమైన శ్రీనగర్‌తో సహా పూంచ్‌, రాంబన్, దోడా, రాజౌరి జిల్లాల్లో ల్యాండ్‌ లైన్లు పనిచేస్తున్నాయి. ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత ఆంక్షలు విధించిన కేంద్రం వాటిని సడలించింది.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితి నెలకొలకొనడంతో ప్రజా రవాణా పునరుద్ధరించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేసినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించలేదని జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరోవైపు కశ్మీర్‌ లోయలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు చోట్ల దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కశ్మీర్‌లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ, వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రత, వైమానిక దళాలకు సూచించారు.

అటు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్రాన్ని రెండుగా విభజించడంపై పాకిస్తాన్‌ అక్కసు వెళ్లగక్కుతోంది. జమ్ము, కశ్మీర్‌లలో అలజడులు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనేలా చేయాలని ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదులను పురికొల్పడం ద్వారా అశాంతి నెలకొల్పి, ఆ నెపాన్ని స్థానికులపైకి నెట్టాలని కుట్రచేస్తోంది.

మరో వైపు జోథ్‌ పూర్ -కరాచీ మధ్య నడిచే థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది.తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ రద్దు అమల్లో ఉంటుందని వాయువ్య రైల్వే అధికారులు తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.