నాలుక కోసుకుని భార్య చేతిలో పెట్టిన యువకుడు

అందరూ తనను అసహ్యించుకుంటున్నారన్న ఆవేదనతో గిరిజన యువకుడు తన నాలుకను కోసి తన భార్య చేతిలో పెట్టిన ఘటన నల్లమలలో సంచలనం రేపింది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం సార్లపల్లిలో ఈఘటన చోటుచేసింది. చంద్రయ్య దంపతులు సమీప అటవీ ప్రాంతంలో ఆటవీ ఉత్పత్తులను సేకరించి జీవనం సాగిస్తున్నారు. అయితే ఊళ్లో అందరూ తనను తిడుతున్నారంటూ ఇంట్లో చాకును తీసుకుని తన నాలుకను కోసి తన భార్య లింగమ్మ చేతిలో పెట్టారు.

దీంతో ఆందోళనకు గురైన భార్య కుటుంబ సభ్యులకు , గ్రామస్తులకు తెలిపింది. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు బాధితుడిని నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.