రోడ్డుపైకి మొసలి.. దానిపై నుంచి వాహనం వెళ్లడంతో..

సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్ట్‌ నుంచి వజినేపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఓ మొసలి మృత్యువాత పడింది. గుర్తు తెలియని వాహనం మొసలిపై నుంచి వెళ్లడంతో మృతిచెందింది. పులిచింత ప్రాజెక్టులో రెండు రోజుల క్రితం డ్యామ్‌ క్రస్ట్‌గేట్లు, కరకట్ట సమీపంలో ఐదు మొసళ్లు దర్శనమిచ్చాయి. దీంతో జాలర్లు హడలెత్తిపోయారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు తెల్లవారు జామున వాటిలో ఓ మొసలి కర్తవాగు నుంచి రోడ్డుపైకి వచ్చి పడుకుంది. అంతలో వాహనం దానిపై నుంచి వెళ్లడంతో మొసలి చనిపోయింది.

మొసలి చనిపోయిన విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రోడ్డుపై మొసలి చనిపోయి ఉండటంతో మిగిలినవి కూడా బయటికి వచ్చాయేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.