అమరావతి నుంచి తరలి వెళ్తున్న సంస్థలు . రైతుల్లో ఆందోళన

అమరావతి నుంచి తరలి వెళ్తున్న సంస్థలు . రైతుల్లో ఆందోళన
X

అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం రాజధాని రైతుల్లో గందరగోళం సృష్టిస్తోంది. సింగపూర్ కన్సల్టెంట్స్, నాగార్జున, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ తరలివెళ్లటంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో ఒక్కో కంపెనీ తరళివెళ్తోంది . రాజధాని వస్తుందని వేల ఎకరాలు ఇచ్చిన తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. అమరావతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే నిరాహారదీక్షలకు కూడా వెనకడుగు వేసేది లేదంటున్నారు రైతులు.

Tags

Next Story