తొలి సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్‌ను ప్రారంభించిన ప్రధానులు

తొలి సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్‌ను ప్రారంభించిన ప్రధానులు

దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, నేపాల్‌ ప్రధాని కే.పీ.శర్మ ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌లోని మోతీ హారీ, నేపాల్‌లోని ఆమ్లేఖ్‌గంజ్‌ మధ్య ఈ పైప్‌లైన్‌ నిర్మించారు. దీని పొడవు 60 కిలోమీటర్లు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ పైప్‌లైన్‌ ఇరుదేశాల మధ్య మైత్రికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. దీని నిర్మాణంలో నేపాల్‌ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇరుదేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్‌.. అనుకున్న సమయానికంటే ముందే పూర్తైందన్నారు మోదీ..

1996లోనే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. 2016లో మోదీ నేపాల్‌ పర్యటన తర్వాతనే ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్‌ పెట్టుకున్నప్పటికీ అది కాలేదు. నేపాల్‌లోని పార్సా జాతీయ పార్క్‌లో చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story