జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ యుద్ధభేరీ

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కమలదళం యుద్ధభేరీ మోగించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమరశంఖం పూరించారు. రాంచీలో జరిగిన భారీ బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్, మంత్రులు, నాయకులు ఈ సభకు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ పథకాన్ని మోదీ ప్రారంభించారు. అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్రం తరఫున ఏటా ఆర్థికసాయం అందించనున్నారు. వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. అవినీతిని సహించే ప్రసక్తే లేదని, అవినీతిపరులను జైళ్లకు పంపించడం ఖాయమని తేల్చి చెప్పారు.

జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్-డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలదళం ఆశిస్తోంది. అందులో భాగంగా మూడు నెలలు ముందుగానే ప్రచారం ప్రారంభించింది. మోదీ మేజిక్, అమిత్ షా చాణక్యం తమను గట్టెక్కిస్తాయని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.

Also watch :

Recommended For You

Leave a Reply

Your email address will not be published.