టీవీ5 స్టింగ్‌ ఆపరేషన్‌.. బయటపడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు

టీవీ5 స్టింగ్‌ ఆపరేషన్‌.. బయటపడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు

సెలవు రోజుల్లో పనిచేయడానికే అధికారులు పెద్దగా ఆసక్తి చూపారు. కానీ యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆనంద్‌ సార్‌ రూటే సపరేటు. సెలవు రోజు కూడా ఆఫీసుకు వచ్చేస్తాడు. అది దొడ్డిదారిన. రావడమే కాదు వచ్చి రాగానే... హడావుడిగా ఫైళ్లు క్లియర్‌ చేసే పనిలో పడిపోతాడు. అయ్యగారి వ్యవహారంపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు టీవీ 5 కి సమాధానం అందించారు. ఆయన్ను ఫాలో అయిన టీవీ 5 సిబ్బంది స్టింగ్ ఆపరేషన్‌ చేపట్టింది.

వెనక దారి నుంచి ఆఫీసులోకి వచ్చిన సబ్‌ రిజిస్ట్రార్‌‌పై నిఘా పెట్టింది. ఎందుకు ఆఫీసుకు వచ్చారు...? ఉన్నతాధికారుల ఆదేశాలేమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించే సరికి.. సారుకు నోట మాట రాలేదు. పెండింగ్‌ ఫైళ్లు క్లియర్‌ చేసేందుకు వచ్చానంటూ చెప్పుకొచ్చారు. అయితే సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్‌ చేయించారని ప్రశ్నిస్తే... నీళ్లు నమిలాడు ఈ రిజిస్ట్రార్‌ సార్‌. దీంతో హడావుడిగా ఆ సీసీకెమెరాలను ఆన్‌ చేయించాడు.

చౌటుప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని అనేక ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వందే ఇక్కడ ఏ ఫైలు కదలదనేది ఎవరిని అడిగినా చెప్పే మాటే. దీనికి తోడు వివాదాస్పద భూములను, ప్రభుత్వ భూములను అక్రమార్కులకు అప్పనంగా కట్టబెట్టేందుకు సెలవు రోజుల్లోనూ పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story