బ్యాంకులకు వరుసగా సెలవులు.. ముందే చూసుకోండి పనులు..

బ్యాంకులకు వరుసగా సెలవులు.. ముందే చూసుకోండి పనులు..

ఈ నెలలో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 26 , 27 న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. అలాగే 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కాగా.. 29 ఆదివారం. తిరిగి సోమవారం (సెప్టెంబర్ 30)న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. అయితే ఆ రోజూ కూడా బ్యాంకు లావాదేవీలు ఉండవు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆ తర్వాత నెల అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు ఓపెన్ అవుతుండగా.. ఆ మరోసటీ రోజు గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు మళ్ళీ సెలవు ఉండనుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఆరురోజుల సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఐదురోజులు వరుస సెలవులు ఉండనుండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ నగదు కావాలనుకునే ఖాతాదారులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story