ఉపఎన్నికల నేపథ్యంలో 32 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఉపఎన్నికల నేపథ్యంలో 32 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల నేపథ్యంలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. 32 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.యూపీలోని 10 స్థానాలు, కేరళలో 5, అసోంలో 4, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం 2, బీహర్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మిగిలిన 19 మందిని పేర్లను తర్వాత విడుదల చేస్తామని ప్రకటించింది.

ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికలపై వారు చర్చించారు. ఎన్నికల కార్యాచరణ, ప్రచారం తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వబోమని గతంలోనే బీజేపీ హైకమాండ్ తేల్చిచెప్పింది. అయితే హర్యానాలో కేంద్రమంత్రి రావు ఇంద్రిజిత్ సింగ్ తన కూతురి కోసం టికెట్ అడుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story