ఇష్టానుసారం చేయడానికి ఇది పులివెందుల కాదు : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత మూడు నెలల్లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎలా పెట్టారు? టీడీపీ మహిళ నేతలపై వైసీపీ వాళ్లు ఎలాంటి అసభ్య పోస్టులు పెట్టి వేధిస్తున్నారో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. బాధితులను మీడియా ముందుకు తీసుకొచ్చి ఆధారాలతో సహా చూపించారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వం అణచి వేసే ధోరణితో వ్యవహరిస్తుందని.. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. చట్టం అందరికి చట్టంగా ఉంటుందా? లేక ఒక వైసీపీకి మాత్రమే చుట్టంగా ఉంటుందా అని ప్రశ్నించారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని.. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేస్తామని అన్నారు.

టీడీపీపై నీచంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకోరని.. కానీ చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చాలా నీచాతి నీచంగా క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం చేయడానికి ఇది పులివెందుల కాదని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఆడ బిడ్డలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సోషల్‌ మీడియాలో వైసీపీ పెట్టిన అసభ్యకర పోస్టులను మీడియాకు చూపించిన చంద్రబాబు.. ఇంత నీచమైన రాజకీయం తన 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదన్నారు.

శ్రీవారి పింక్‌ డైమండ్‌ ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు చంద్రబాబు. పింక్‌ డైమండ్‌ తన ఇంట్లో ఉందని తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు అధికారులు అసలు పింక్‌ డైమండే లేదని చెబుతున్నారని గుర్తు చేశారు. రొటిన్‌ కి భిన్నంగా వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు… ఒక్కో ఆరోపణను ఆధారాలతో సహా తిప్పికొట్టడంతో వైసీపీ ప్రభుత్వం ఇరుకునపడినట్లైంది.

Recommended For You