రికార్డు సృష్టించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

రికార్డు సృష్టించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత వైమానిక దళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్ రూపొందించిన రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌ చేతికి అందింది. డస్సాల్ట్‌ కంపెనీలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ చేతుల మీదుగా తొలి విమానాన్ని మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్వీకరించారు.

విజయ దశమి పండుగకు తోడు భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో తొలి విమానం అందుకున్నా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు. యుద్ధ విమానాలను తయారుచేస్తున్న విధానాన్ని పరిశీలించారు.

రఫేల్‌ అందిన ఈరోజు భారత వైమానిక దళానికి చరిత్రాత్మకమైందని రాజ్‌నాథ్ అన్నారు. ఇవి భారత వైమానిక దళాన్ని బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అనుకున్న సమయానికి రఫెల్ యుద్ధ విమానాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు రాజ్‌నాథ్‌. రఫెల్‌లో ప్రయాణించారు.

రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత దేశ రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ రికార్డు సృష్టించారు. తన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, హాయిగా సాగిందన్నారు. ఇవి మునుప్పెన్నడు లేనటువంటి క్షణాలని, యుద్ధ విమానంలో సూపర్‌సానిక్‌ స్పీడ్‌తో ప్రయాణించే రోజు ఒకటి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు..

భారత్‌తో బంధానికి రఫేల్ అప్పగింత సరికొత్త అధ్యాయమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్ అన్నారు. రెండు దేశాల రక్షణ వ్యూహాత్మక సంబంధం మరింత బలపడిండని అన్నారాయన. డస్సాల్ట్‌ సంస్థ ప్రతినిధులు సైతం.. సంతృప్తి వ్యక్తంచేశారు.

విజయదశమి రోజు ఆయుధ పూజ చేస్తుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందని భారతీయల నమ్మకం. అందుకే.. ఫ్రాన్స్‌ వెళ్లి రాఫెల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. రాఫెల్ యుద్ధ విమానానికి కుంకుమ బొట్టు పెట్టారు. ఓమ్‌ అని రాశారు. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టారు. భారతీయ సంప్రదాయాల ప్రకారం రఫేల్‌కు పూజలు నిర్వహించారు రాజ్‌నాథ్‌ సింగ్.

Tags

Read MoreRead Less
Next Story