రొమాంటిక్‌గా నిశ్చితార్థం చేసుకున్న ప్రభాస్ బ్యూటీ

జర్మనీలో పుట్టి, పెరిగిన ఎవెలిన్‌ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు జర్మన్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ. ‘సాహో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఎవెలిన్‌.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నారు. ఈ బ్యూటీ త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఆస్ట్రేలియా ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్‌ సర్జన్‌ తుషన్ బైనాండితో ఆమె కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఎవెలిన్‌ గత కొంతకాలంగా తుషన్‌తో డేటింగ్‌లో ఉన్నారు.

ఈ క్రమంలో ఈ ప్రేమపక్షులకు ఎంగేజ్‌మెంట్‌ చేశారు కుటుంబసభ్యులు. తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్నీ ఎవెలిన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. సిడ్నీలోని ప్రముఖ హార్బర్‌ బ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌లో తుషన్‌తో రోమాంటిక్‌గా దిగిన ఓ ఫొటోను కూడా ఆమె షేర్‌ చేశారు. ఎవెలిన్‌ తనకు తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని ప్రకటించగానే అభిమానుల నుంచి ఆమెకు వెల్లువలా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో తనను విష్‌ చేసిన వారందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఎవెలిన్‌ శర్మ.

Recommended For You