ఒక్కటైన అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి

ప్రేమకు కులం, మతం, ప్రాంతం లేవని నిరూపించింది ఓ జంట. అమెరికాకు చెందిన అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ నగరం గూడవల్లి ప్రాంతానికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతికుమారిల దంపతుల కుమార్తె నాగసంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసింది. కొంతకాలంగా ఒరెగాన్‌లోని ఇంటెల్‌ కార్పొరేషన్‌లో టెక్నాలజీలో డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఆడం బ్యాంగ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఆడం ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలకు చెబితే ఒప్పుకోరని అనుకున్నారు. కానీ ఇరువురు తల్లిదండ్రులు పెద్ద మనసుతో వీరి వివాహానికి అంగీకరించారు. పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరగాలని పెళ్లికూతురు తరుపువారు పట్టుబట్టడంతో మంగళవారం రాత్రి వీరి వివాహం హిందూ సంప్రదాయం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల నడము మూడు ముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటయ్యింది.

Recommended For You