మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు కన్నుమూత

మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు కన్నుమూత

ది లెజండరీ సోవియట్ కాస్మోనాట్(అంతరిక్ష యాత్రికుడు),54ఏళ్ల క్రితం అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తి అలక్సీ లియోనోవ్ కన్నుమూశారు. ఆయన వయసు 85ఏళ్ల. గతకొంతకాలంగా చికిత్స పొందుతూ.. మాస్కోలో కన్నుమూసినట్టు శుక్రవారం రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా లియోనోవ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రోస్కోస్మోస్ వెల్లడించింది.

లియోనోవ్ పశ్చిమ సైబీరియాలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో 1934 లో జన్మించాడు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ హయాంలో వేలాదిమంది రైతుల మాదిరిగానే, అతని తండ్రిని కూడా అరెస్టు చేసి గులాగ్ జైలుకు పంపించారు, అయితే అతను జైలు నుంచి విడుదలై తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడు. చిన్నతనం నుంచి లియోనోవ్ కి పైలట్ కావాలనే కోరికతో పాటు కళలపట్ల ఎనలేని మక్కువ ఉండేది. దాంతో పైలెట్ శిక్షణా ఏవియేషన్ కాలేజీలో చేరే ముందు కూడా ఆర్ట్ స్కూల్‌కు వెళ్ళడం చేశారు. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు కూడా స్కెచింగ్‌ను వదల్లేదు. 1975 లో అపోలో-సోయుజ్ విమానంలో వెళ్లేటప్పుడు తనతో పాటు కొన్ని రంగుల పెన్సిళ్లని కూడా తన వెంట తీసుకెళ్లాడు. మార్చి 18, 1965 న లియోనోవ్ అంతరిక్ష చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకునాడు.

Tags

Read MoreRead Less
Next Story