ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ.. బంగారు ఆభరణాలు..

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయలు విలువ చేసే 12 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ చోరీకి సంబంధించిన ఆధారాలు సేకరించారు.

బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలో ఫూటేజ్‌ రికార్డు కాకుండా హార్డ్‌ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే బ్యాంక్‌లో ఆభరణాలను కుదవపెట్టిన వివరాలు తెలియకుండా కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ధ్వంసం చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బ్యాంక్‌ మేనేజర్‌ పురుషోత్తం, క్యాషియర్‌ నారాయణస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Recommended For You