వేగంగా దూసుకొచ్చి బాలుడిని ఢీకొట్టిన స్కూల్‌ వ్యాన్‌

తిరుపతి శ్రీనగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్కూలు బస్సు కింద పడి నాలుగేళ్ల ఉజ్వల్‌ దుర్మరణం చెందాడు. స్కూల్‌లో ఆడుకుంటున్న ఉజ్వల్‌ ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చేశాడు. ఇంతలో వేగంగా వచ్చిన స్కూల్‌ వ్యాన్‌ అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

Recommended For You