అమ్మ ఎప్పుడూ నాతో ఆమాట..

నీ మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తావో అవి నీ ముఖంలో ప్రతిబింబిస్తాయి. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందునా నటులకు అది అత్యంత అవసరం. ఓ నటి హావ భావాలను, ఆమె ప్రవర్తను ఓ కంట కెమెరా కన్ను కనిపెడుతూనే ఉంటుంది. చాలా కష్టపడుతున్నాము  అని మనకి మనం అనుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తి కూడా అదే స్థాయిలో.. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే కష్టపడుతుంటారు. ఇష్టంగా కష్టపడాలి.. మన కాళ్లపై మనం నిలబడాలి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ నిత్య విద్యార్థిలా ఉండాలి. కెరీర్‌పై స్థాయిలో ఉన్న వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. ఏకాగ్రతతో పని చేయాలి అని అమ్మ ఎప్పుడూ తనతో అంటూ ఉండేదని తల్లి శ్రీదేవి  అన్న మాటలను జాన్వీ కపూర్ ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. తానూ అమ్మలా మంచి వ్యక్తిత్వం ఉన్న నటిగా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్ర పరిశ్రమలో నటిగా రాణించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. జాన్వీ ప్రస్తుతం గుంజన్ సక్సేనా దర్శకత్వంలో ‘ది కార్గిల్ గర్ల్’ చిత్రంలో నటిస్తున్నారు. నెట్‌ప్లిక్స్ సిరీస్ ‘గోస్ట్ స్టోరీస్‌’లోనూ జాన్వీ సందడి చేయనుంది.

Recommended For You