చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు – కేకే


సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ఆర్టీసీ సమ్మె విషయంలో మధ్యవర్తిగా ఉంటానని స్పష్టం చేశారు ఎంపీ కేశవరావు. సమ్మె విషయంలో సీఎం నన్ను ఇప్పటి వరకు పిలవలేదని.. ఆర్టీసీ కార్మికులు కూడా కలవలేదన్నారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చనిపోయారన్న బాధతో సోమవారం ప్రకటన జారీ చేశానని చెప్పారు కేకే. కార్మికులు తనతో చర్చలకు సానుకూలంగా వుండటం మంచి పరిణామమని అన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నానని.. ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే అది సాధ్యం కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు కేశవరావు.

Recommended For You