రైతు భరోసా కార్యక్రమంపై నారా లోకేష్ విమర్శలు

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం జగన్‌ గారు ప్రవేశపెట్టింది వైఎస్‌ఆర్ రైతు నిరాశ కార్యక్రమం అన్నారు. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద 12వేల 500 ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు కేవలం 7,500 ఇస్తూ రైతులకు రివర్స్ టెండర్ వేశారని విమర్శించారు లోకేష్. 64 లక్షల మంది రైతుల్లో సగం మందిని తగ్గించారని ఆరోపించారు. కులాన్ని చూడం అంటూనే ఓసీలైన రైతులకు మొండిచేయి చూపారంటూ ఎద్దేవా చేశారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మొదట చెప్పి.. ఇప్పుడు విడతల్లో ఇస్తూ మడమ తిప్పారని విమర్శించారు లోకేష్.

Recommended For You