రసాభాసగా మారిన రైతు భరోసా కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని శివకోటి గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం రసాభాసగా మారింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ రాకుండానే వైసీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. అయితే కాసేపటికే సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. అధికారులు, వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్‌ పాటించకపోవడంపై నిలదీశారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వ్యవసాయ అధికారులు తనను పిలిచి అవమానించారని మండిపడ్డ రాపాక.. అధికారుల తీరుకు నిరసనగా సభ నుండి వెళ్లిపోయారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Recommended For You