కాలేజ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజ్‌ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన లహరి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లి ఇటీవలే కాలేజ్‌కు వచ్చింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చిన కాసేపటికే లహరి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది.

లహరి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలేజ్‌లో ఏమైనా ఇబ్బందులున్నాయా లేదా కుటుంబకలహాలే కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. లహరి క్లాస్‌మేట్స్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ఇంటి నుంచి వచ్చిందని.. ఇంతలో ఏమైందో తెలియదని స్నేహితులు చెబుతున్నారు.

Recommended For You