విద్యార్ధుల్ని చితకబాదిన టీచర్‌.. స్కూల్‌ ముందు పేరెంట్స్ ఆందోళన

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్ధులను ఓ టీచర్‌ చితకబాదాడు. ఎమ్మిగనూరులోని మాచాని సోమప్ప జిల్లా పరిషత్‌లో 9 వ తరగతి చదువుతున్న విశ్వం, సుబాన్‌ అనే విద్యార్ధులపై సైన్స్‌ టీచర్‌ రాజశేఖర్‌ కర్రతో ఇష్టం వచ్చినట్లు చికతబాదాడు. దీంతో విద్యార్ధుల శరీరాలపై బొబ్బలు వచ్చాయి. ఈ విషయాన్ని.. విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహించిన పేరెంట్స్‌.. స్కూల్‌ ముందు ఆందోళనకు దిగారు. టీచర్‌ను సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Recommended For You