ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఈ క్షణం నుంచే చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలంది న్యాయస్థానం. అటు ఆర్టీసీ ఎండీని వెంటనే నియమించి రెండ్రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని, తిరిగి 18వ తేదీలోపు శుభవార్తతో వస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయం పడింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని అని సూచించింది హైకోర్టు. రెండ్రోజుల్లో ఎలాంటి నిర్ధిష్ట ప్రణాళిక చర్యలు తీసుకుంటారో.. ప్రభుత్వం కూలంకషంగా కోర్టు రిపోర్ట్‌ సబ్మిట్‌ చేయాలంది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది హైకోర్టు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే.. విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడగించారని హైకోర్టు ప్రశ్నించింది. దాదాపు 4 వేల బస్సులు నడవడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడింది న్యాయస్థానం.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని హైకోర్టులో తన వాదనలు వినిపించింది ప్రభుత్వం. ఒక వేళ అలా చేస్తే.. మిగితా కార్పోరేషన్లు కూడా ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తాయంది. దాదాపు 75 శాతం బస్సులు నడుస్తాయని, కొద్ది రోజుల్లో మిగిలిన వాటిని కూడా పునరుద్ధరిస్తామంది. 4 వేల బస్సలకు డ్రైవర్లు, కండక్టర్లును ఎలా తెస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Recommended For You