ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

సెల్ఫీ సరదా చిత్తూరు జిల్లాలో యువకుడి ప్రాణాలు తీసింది. చెన్నైకు చెందిన ముగ్గురు యువకులు బచ్చినాయుడు కండ్రిగ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద సెల్ఫీ తీసుకున్నారు. అయితే వారిలో మనోజ్‌ అనే యువకుడు కాలువ నీటి సమీపంలో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. ఇది గమనించిన ఇద్దరు స్నేహితులు కాలువలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. కాలువలో ప్రవాహం ఉధృతంగా ఉండడంతో మనోజ్‌ కొట్టుకుపోయాడని స్నేహితులు మాణిక్యం, ప్రశాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Recommended For You