వృద్ధుడిని మింగబోయిన కొండచిలువ.. చివరకు..(వీడియో)

వృద్ధుడిని మింగబోయిన కొండచిలువ.. చివరకు..(వీడియో)

పాముల్లో కొండచిలువ అత్యంత బయంకరమైనదన్న విషయం అందరికి తెలుసు. మనిషి ఒంటరిగా కనబడితే మింగేస్తుంది. కొండచిలువ భారిన పడి మరణించిన వారి సంఖ్య చాలానే ఉంది. అయితే తాజాగా ఓ వృద్ధుడు కొండచిలువ భారిన పడి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని నెయ్యర్ ఆనకట్ట సమీపంలో 61 ఏళ్ల భువనచంద్రన్ నాయర్ తన తోటి కూలీలతో పొదలను శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో పొదల చాటున నక్కిన ఆ కొండచిలువ.. నాయర్ ను చూసింది.

దాంతో అమాంతం అతని మీదకు దూకింది. నాయర్ మెడను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతను అరిచేందుకు కూడా మార్గం లేకుండా మెడను చుట్టేసింది. అదృష్టవశాత్తూ, ఘటనా స్థలంలో ఉన్న ఇతర కార్మికులు కొండచిలువను పట్టుకున్నారు. అతని మెడలో నుండి పామును విడదీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియో తెలియజేస్తుంది. ఈ భయానక వీడియో.. కొండచిలువ నాయర్ మెడ చుట్టూ పట్టు బిగించడంతో అతను రోధిస్తున్నట్టు చూపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story