హాస్పిటల్‌లో అమితాబ్.. మూడు రోజులుగా..

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. లివర్ సమస్య కారణంగా మూడు రోజుల నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం వెల్లడించింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆయన హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అక్టోబర్ 11న బిగ్ బి తన 77వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు.

Recommended For You