రోహిత్‌ నయా వరల్డ్‌ రికార్డు

రోహిత్‌ నయా వరల్డ్‌ రికార్డు

సౌతాఫ్రికాతో రాంచిలో జరుగుతున్న మూడో టెస్టులోనూ టీమిండియా అదరగొడుతోంది..తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ117 పరుగులు, రహానే 83 రన్స్‌తోనూ క్రీజులో ఉన్నారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు అజేయంగా 185 పరుగుల జోడించింది. అయితే తొలి రోజు పూర్తిస్థాయి ఆట సాధ్యపడలేదు..బ్యాడ్‌ లైట్‌ కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. కేవలం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇంకా 32 ఓవర్లు ఆడాల్సి ఉన్నప్పటికీ బ్యాడ్‌ లైట్‌ అడ్డుకుంది. టీ విరామానికి వెళ్లిన వచ్చిన కాసేపటికి వర్షం కూడా పడటంతో తొలి రోజు మిగిలి ఉన్న ఆటను రద్దు చేశారు.

మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ 10 రన్స్ మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత చతేశ్వర పుజారా డకౌట్‌ అయ్యాడు. కెప్టెన్ కోహ్లి రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించినా..దక్షిణాఫ్రికా పేసర్‌ నార్జీ వేసిన బంతికి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత మరోవికెట్ పడకుండా జాగ్రత్తపడింది రోహిత్-రహానే జోడి. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బౌండరీల మోత మోగించారు..

ఇక ఈ సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ మరోసారి రెంచరీతో మోతమోగించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు రోహిత్ శర్మ సొంతమయ్యాయి. ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశాడు రోహిత్. మూడో టెస్టులోనూ శతక్కొట్టడం ద్వారా.. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు రోహిత్. ఒక సిరీస్‌లో కనీసం మూడు సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో చేరిపోయాడు. ఇక ఒక్క టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గతంలో వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ ఒక సిరీస్‌లో 15 సిక్సర్లు సాధిస్తే దాన్ని బ్రేక్‌ చేశాడు రోహిత్.

Tags

Read MoreRead Less
Next Story