లంగరు బోటుకు తగలి బయటకి వచ్చిన తలలేని మృతదేహం

కచ్చులూరు బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం, గజఈతగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండోసారి గోదావరి అడుగుభాగంలోకి వెళ్లి వచ్చారు గజ ఈతగాళ్లు. బోటు మునిగిన ప్రాంతం నుంచి తల లేని మృతదేహం ఒకటి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నల్లజీన్‌ ప్యాంట్‌తో ఉన్న మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. లంగర్‌కు బోటు తగిలి కదలటం వల్లే ఈ మృతదేహం బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెలికీతీత పనులు మరింత ముమ్మరం చేసింది ధర్మాడీ సత్యం బృందం.

Recommended For You