స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కోసం యూనివర్సిటీ ఏర్పాటు

స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కోసం యూనివర్సిటీ ఏర్పాటు

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం నెలరోజుల్లో పాఠ్య ప్రణాళికల్లో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై ప్లాన్‌ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్‌. స్కిల్‌ డెవపల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం యూనివర్సిటీల బాధ్యత అని గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎల్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు...

రాష్ట్రంలో స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, బీకామ్‌ సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు అదనంగా ఏడాదిపాటు అప్రెంటీస్‌ చేయాలన్నారు. అప్రెంటీస్ పూర్తిచేసిన తర్వాత కూడా శిక్షణ అవసరమనుకుంటే మళ్లీ నేర్పించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపివేయాలని అధికారులకు సీఎం సూచించారు. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగిస్తున్నట్లు చెప్పారు...

గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మావన వనరుల మ్యాపింగ్‌ జరాలన్నారు. స్థానికంగా వారి సేవలను వినియోగించుకునేలా ఒక యాప్‌ రూపొందించాలని అధికారులకు సూచించారు. నెలరోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story