పదవతరగతి పాసైతే చాలు.. గ్రామ వాలంటీర్‌గా

ap-jobs

ఏపీ ప్రభుత్వం మొదటిసారి గ్రామ వాలంటీర్ల నియామకాన్ని చేపట్టినప్పుడు కనీస విద్యార్హత మైదాన ప్రాంతంలో ఇంటర్, గిరిజన ప్రాంతంలో పది పాసై ఉండాలనేది రూల్‌గా పెట్టారు. కానీ అర్హులైన అభ్యర్థుల నియామకం జరిగిన తరువాత మరి కొన్ని పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. దాంతో ఆ మిగిలిన 9,674 పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఈసారి అర్హతను పదవతరగతినే ప్రామాణికంగా తీసుకుని నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు అనుమతులు తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా ఉన్న పోస్టుల కోసం నవంబర్ 1న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. నవంబర్ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 20 మధ్య.. మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూ లు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 22వ తేదీ కల్లా సమాచారం అందించి, వారికి నవంబరు 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.