ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు

ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం డిపోల ముందు ధర్నాకు అఖిలపక్షం నిర్ణయించింది. అలాగే కేసీఆర్‌ వైఖరిపై కోదండరాం మండిపడ్డారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెగానే ఉన్నా.. త్వరలో ఇది సకల జనుల సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పుడు రాని సంఘాలు రేపు ఉద్యమంలో పాల్గొంటాయని కోదండరాం అన్నారు. ఆర్టీసీ విలీనానికి ప్రక్రియ మొదలు పెడితే తప్ప ఈ సమ్మె ఆగదని స్పష్టం చేశారు.