బెల్ట్ షాప్‌పై మహిళల దాడి

మద్యం బెల్ట్‌ షాప్‌పై నారీలోకం కదం తొక్కింది. బెల్ట్‌షాప్‌పై దాడి చేసి మద్యాన్ని రోడ్డుపై పడేశారు. గ్రామంలో మద్యం అమ్మొద్దంటూ రైడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో జరిగింది.

గ్రామంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగడంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తరుచుగా కుటుంబాల్లో గొడవలు జరగడం మహిళల కోపానికి కారణమైంది. ఇక లాభంలేదనుకుని గ్రామంలోని మహిళలు ఉద్యమించారు. బెల్ట్‌ షాప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత రోడ్డుపై ధర్నా నిర్వహించారు.