ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దు: అసదుద్దీన్ ఓవైసీ

ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దు: అసదుద్దీన్ ఓవైసీ
X

OYC

ఆర్టీసీ సమ్మెపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఉందన్న ఆయన.. ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌ మాటలను వినాలని కోరారు. సమ్మె సమయంలో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఉచ్చులో పడవద్దంటూ సూచించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story