బేబీ బోనస్.. బిడ్డను కంటే రూ.8 లక్షలు..

బేబీ బోనస్.. బిడ్డను కంటే రూ.8 లక్షలు..

baby

ఇండియాలో జనాభా సంఖ్యను తగ్గించడానికి ఒకరు లేదా ఇద్దరు ఉంటే ఫలానా పథకానికి అర్హులు అంటూ జన సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుంటాయి ప్రభుత్వాలు. పెరిగి పోతున్న జనాభాను అరికట్టే ప్రయత్నాల్లో భారత్ ఉంటే.. పిల్లల్ని కనండి పాపులేషన్ పెంచండి అంటూ కొన్ని దేశాలు మొరపెట్టుకుంటున్నాయి. నడవడానిక్కూడా ఖాళీలేని మన నగరాలతో పోలిస్తే అక్కడ నగర జనాభా కేవలం 725 మంది మాత్రమే ఉండడం ఆ దేశ నాయకులకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది. జపాన్, ఇటలీ, ఇస్తోనియా, ఫిన్లండ్ తదితర దేశాలు జనాభా లేమితో విలవిల్లాడుతున్నాయి.

ఇక లాభం లేదని రంగంలోకి దిగిన ప్రభుత్వం బిడ్డను కంటే దాదపు రూ.8 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. 2012లో ఫిన్లండ్‌లోని లెస్టిజార్వి అనే ఊరిలో ఓ చిన్నారి పుట్టింది. ఆ తరువాత మరెక్కడా ప్రసవాలు జరగలేదు. దీంతో అధికారులు 2013లో బేబీ బోనస్ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా రూ.8లక్షలు బిడ్డ పుట్టిన పదేళ్లలో విడతల వారీగా అందజేస్తారు. ఈ పథకం పుణ్యమా అని ఏడేళ్లలో 60 మంది పిల్లలు పుట్టారు. పథకం రాకముందైతే అందులో సగం మాత్రమే ఈ లోకం లోకి వచ్చారు.

Read MoreRead Less
Next Story