గీ పోలీస్ ఉద్యోగం నాకొద్దు బాబోయ్.. పెళ్లి చేసుకుందామంటే పిల్లనివ్వట్లేదు..

గీ పోలీస్ ఉద్యోగం నాకొద్దు బాబోయ్.. పెళ్లి చేసుకుందామంటే పిల్లనివ్వట్లేదు..

pratap

బీటెక్ చదివి హాయిగా ఏసీలో కూర్చొని సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేయక.. ఎందుకురా నీకీ పోలీస్ ఉద్యోగం అని ఎంత చెప్పినా వినకుండా డ్యూటీలో జాయిన్ అయ్యాడు సిద్దాంతి ప్రతాప్. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. చార్మినార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ప్రతాప్‌కి ఉద్యోగం వచ్చింది కదా అని ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అబ్బాయి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పేసరికి ఆమడ దూరం పారిపోతున్నాయి సంబంధాలన్నీ.

దూరం నుంచి చూసి కానిస్టేబుల్ ఉద్యోగంపై ప్రేమ పెంచుకున్నానని.. అయితే ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుభవ పూర్వకంగా అసలు విషయం తెలుసుకున్నానని అందుకే నాకీ ఉద్యోగం వద్దంటూ రాజీనామా చేసాడు. పెళ్లి చేసుకుందామంటే పిల్లని కూడా ఎవరూ ఇవ్వట్లేదని.. కానిస్టేబుల్ కష్టాలు చాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కి రాజీనామా లేఖను సమర్పించాడు ప్రతాప్. 35 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు కూడా కానిస్టేబుల్‌గానే రిటైర్మెంట్ అయిన ఉదంతాలను తాను గుర్తించానని ప్రతాప్ తర రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జీతాలు పెరిగినా జీవితాలు మారని కానిస్టేబుల్ ఉద్యోగం నాకొద్దంటూ రిజిగ్నేషన్ పత్రంలో రాసుకొచ్చాడు.

Read MoreRead Less
Next Story