చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

babu

ఇసుక కష్టాలపై చంద్రబాబు తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. విజయవాడలో ఈనెల 14న దీక్ష చేస్తానంటూ టీడీపీ శ్రేణుల సమావేశంలో ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు దీక్షకు మున్సిపల్ స్టేడియంలో పర్మిషన్‌ ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు గురువారం పోలీసులను, మున్సిపల్ అధికారులను కోరారు. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప.. ఇతర కార్యక్రమాలకు మున్సిపల్ స్టేడియంలో అనుమతి లేదని అధికారులు జవాబిచ్చారు.

ఏపీలో నెలకొన్ని ఇసుక కష్టాలపై ప్రత్యక్ష పోరాటానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగుతున్నారు. ఈనెల 14న విజయవాడలో ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే.. మున్సిపల్ స్టేడియంలో దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా ధర్నాచౌక్‌ను పరిశీలిస్తున్నారు.

Recommended For You