పాత బస్‌ షెల్టర్‌లో సగం కాలిన మృతదేహం కలకలం

murder

కడప జిల్లా రాజంపేట పాత బస్‌ షెల్టర్‌లో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. బస్‌ షెల్టర్‌లో డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

న్యూస్‌ పేపర్లతో వ్యక్తిని తగలబెట్టిన ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. కాల్చిన వ్యక్తిని పక్కకు ఈడ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You