అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ

nara-lokesh

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులతో తనకు సంబంధం ఉందని స్పీకర్‌ చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవం అని తేలితే మీరేం చేస్తారో చెప్పాలంటూ లోకేష్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. సభాపతి స్థానంలో ఉండి ప్రతిపక్షనేతపైనా, మండలి సభ్యుడినైన తనపైనా నిందారోపణలు చేయడం స్పీకర్‌ స్థానానికి సముచితం కాదన్నారు. విలువలతో సభ నడిపించి ట్రెండ్‌ సెట్‌ చేస్తానని చెప్పిన మీరు.. అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్‌ సెట్‌ చేస్తారని అనుకోలేదని లోకేష్‌ లేఖలో విమర్శించారు.

Recommended For You