బ్యాంకు ఉద్యోగి సాయంతో పాత కరెన్సీ మార్చే ప్రయత్నం

police

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా పాత కరెన్సీ పట్టుబడడం కలకలం రేపింది. నోట్లు మార్చేందుకు హైదరాబాద్ నుంచి కోదాడకు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.9 లక్షల 95వేల నగదును సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు సామ్యేల్, కపిల్, ఇంతియాజ్‌లలో ఒకరు బ్యాంకు ఉద్యోగిగా ఉన్నట్టు భావిస్తున్నారు.

Recommended For You