ఆర్టీసీ ప్రైవేటీకరణపై విచారణ వాయిదా

HIGH

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రైవేటీకరణను ఆపాలంటూ ప్రొఫెసర్‌ PL విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈనెల 11 వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. 5 వేల ఒక వంద రూట్లలో ప్రైవేటీకరణ నిలిపివేసేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. అటు.. కేబినెట్ ప్రొసీడింగ్స్ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Recommended For You